Signal అనేది గోప్యత ముఖ్యంగా కలిగిన ఒక సందేశాలు పంపే యాప్. ఇది ఉచితం మరియు ఉపయోగించడానికి సులభం, దీనిలోని పటిష్టమైన ఎండ్-టు-ఎండ్ గుప్తీకరణ మీ చాట్‌లను మరియు కాల్స్‌ను పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది. Signal మీ సందేశాలను చదవలేదు లేదా మీ కాల్స్‌ను వినలేదు మరియు మరెవరూ కూడా అలా చేయలేరు. 

• MacOS లోని Signal, మీ ఫోన్‌లోని Signal తో అనుసంధానించబడుతుంది. 

• ఎండ్-టు-ఎండ్ గుప్తీకరించబడిన టెక్స్ట్ సందేశాలు, స్వర సందేశాలు, ఫోటోలు, వీడియోలు, GIFలు మరియు ఫైల్‌లను ఉచితంగా పంపండి. 

• 1,000 మంది వరకు గ్రూప్ చాట్‌లతో కనెక్ట్ అవ్వండి. అడ్మిన్ పర్మిషన్ సెట్టింగ్‌లతో గ్రూపు సభ్యులను ఎవరు పోస్ట్ చేయవచ్చు మరియు నిర్వహించగలరనేది నియంత్రించండి.

• సుస్పష్టమైన ఎండ్-టు-ఎండ్ గుప్తీకరించబడిన స్వర మరియు వీడియో కాల్స్‌తో మీ స్నేహితులకు కాల్ చేయండి. గ్రూప్ కాల్స్ 75 మంది వరకు మద్దతు ఇస్తాయి.

• Signal మీ గోప్యత కొరకు రూపొందించబడింది. మీ గురించి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మాకు ఏమీ తెలియదు. మా ఓపెన్ సోర్స్ Signal ప్రోటోకాల్ అంటే, మేం మీ సందేశాలను చదవము లేదా మీ కాల్స్‌ని వినం అని అర్థం. మరెవరూ చేయలేరు. బ్యాక్‌డోర్‌లు లేవు, డేటా కలెక్షన్ లేదు, రాజీపడటం లేదు. 

• 24 గంటల తరువాత అదృశ్యమయ్యే ఫోటో, టెక్ట్స్ మరియు వీడియో కథలను పంచుకోండి. గోప్యతా సెట్టింగ్‌లు ప్రతి కథను ఎవరు చూడగలరు అనే దానిపై మీకు పూర్తి నియంత్రణను అందిస్తాయి.

• Signal స్వతంత్ర మరియు లాభాపేక్ష లేనిది; విభిన్న రకమైన ఆర్గనైజేషన్ నుంచి విభిన్నమైన సాంకేతికత కలిగినది. 501c3 లాభాపేక్ష లేని సంస్థ వలే, ప్రకటనదారులు లేదా పెట్టుబడిదారుల నుంచి కాకుండా మీ నుంచి విరాళాల ద్వారా మద్దతు లభిస్తుంది. 

• మద్దతు, ప్రశ్నలు లేదా మరింత సమాచారం కొరకు దయచేసి సందర్శించండి https://support.signal.org/

మా సోర్స్ కోడ్‌ని తనిఖీ చేయడానికి, https://github.com/signalappని సందర్శించండి. 

X లో @signalapp మరియు Instagram లో @signal_app ద్వారా మమ్మల్ని అనుసరించండి
